RJNEWS TELUGU
Date of Publish : 04 September 2026, 5:16 pm Posted by : RJ NEWS TELUGU

జాతీయ రహదారిపై బీభత్సం!

🔸 డివైడర్‌ను ఢీకొని పల్టీలు కొట్టిన కారు

🔸సకాలంలో తెరుచుకున్న ఎయిర్‌బ్యాగులు.. తప్పిన పెను ప్రమాదం

🔸 ఇద్దరికి గాయాలు.. ఆస్పత్రికి తరలింపు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ జాతీయ రహదారిపై ఐటీఐ సమీపంలో శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదం కలకలం రేపింది. నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న TS 36 E 123 నంబర్ గల కారు అదుపుతప్పి డివైడర్‌ను బలంగా ఢీకొని పల్టీలు కొట్టింది.ప్రమాద సమయంలో కారులోని ఎయిర్‌బ్యాగులు సకాలంలో తెరుచుకోవడంతో పెను ప్రమాదం తప్పినట్లు సమాచారం. అయినప్పటికీ కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి గాయాలయ్యాయి. గాయపడిన వారు సిద్దిపేట జిల్లా ములుగు మండలం కోల్తూరు గ్రామానికి చెందిన సురేష్, శ్రీకాంత్‌లుగా గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.ప్రమాదంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.వారం రోజుల క్రితమే ఇదే జాతీయ రహదారిపై రేకులభావి సమీపంలో జరిగిన కారు ప్రమాదం మరువకముందే మరో ఘటన చోటుచేసుకోవడంతో వాహనదారుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.