ట్రావెల్ బస్సులో గంజాయి స్మగ్లింగ్ – ఒకరు అరెస్ట్, ఎక్సైజ్ దాడుల్లో పట్టుబడ్డ మహమ్మద్ ఖాదర్

🔸 మేడ్చల్‌లో 5 కిలోల ఎండు గంజాయి స్వాధీనం.. ఒకరు అరెస్ట్ ఆర్ జె న్యూస్ మేడ్చల్ : ట్రావెల్‌ బస్సులో అక్రమంగా తరలిస్తున్న 5 కిలోల ఎండు గంజాయిని ఎక్సైజ్‌ టాస్క్‌ఫోర్స్‌ అధికారులు పట్టుకున్నారు. ఈ ఘటనలో మహమ్మద్‌ ఖాదర్‌ (46)ను అరెస్టు చేశారు.బుధవారం తెల్లవారుజామున ఎక్సైజ్‌ సూపరింటెండెంట్లు ఫయాజ్‌, విష్ణుమూర్తి ఆదేశాల మేరకు టాస్క్‌ఫోర్స్‌ సీఐలు ఎం.పీ.ఆర్‌. చంద్రశేఖర్‌, బిక్షారెడ్డి ఆధ్వర్యంలో గుండ్లపోచంపల్లి శివారులోని మలీబు రెస్టారెంట్‌ ఎదురుగా వాహన తనిఖీలు చేపట్టారు. నాగ్‌పూర్‌ నుంచి హైదరాబాద్‌కు వచ్చే ట్రావెల్‌ బస్సుల్లో...