RJNEWS TELUGU
Date of Publish : 07 September 2026, 8:37 pm Posted by : RJ NEWS TELUGU

డబిల్‌పూర్ స్వీట్‌హౌస్‌పై SOT దాడులు

🔸కాలం చెల్లిన రసాయనాలు.. సింథటిక్ కలర్స్ స్వాధీనం

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డబిల్‌పూర్‌లో బాలాజీ సాయిరాం మిఠాయి భండార్‌పై కుత్బుల్లాపూర్ జోన్ SOT పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. దాడుల్లో కాలం చెల్లిన రసాయనాలు, సింథటిక్ కలర్స్‌ను గుర్తించి స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మిఠాయిల తయారీ కేంద్రంలో అపరిశుభ్ర వాతావరణం ఉన్నట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా తయారీ ప్రాంతంలో ఎలుకలు, బొద్దింకలు సంచరిస్తున్నట్లు గుర్తుంచినట్లు సమాచారం.నిబంధనలకు విరుద్ధంగా మిఠాయిల తయారీ జరుగుతున్నట్లు అధికారుల పరిశీలనలో వెల్లడైనట్లు తెలుస్తోంది.దీంతో స్వీట్‌హౌస్ యజమానిని పోలీసులు అదుపులోకి తీసుకుని మేడ్చల్ పోలీసులకు అప్పగించినట్లు సమాచారం. స్వాధీనం చేసుకున్న పదార్థాల వివరాలు, వాటి నమూనాల పరీక్ష, కేసు నమోదు తదితర అంశాలపై అధికారికంగా పూర్తి సమాచారం వెలువడాల్సి ఉంది.