ఆర్ జె న్యూస్, మేడ్చల్: జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారంపై ఢిల్లీలో తెలంగాణ పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌తో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. జవహర్‌నగర్ ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను, డంపింగ్ యార్డ్ వల్ల కలుగుతున్న కాలుష్య సమస్యలను పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఈ సమావేశంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మరియు మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ యాదవ్ గారు, జవహర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దొంతగాని శాంతి కోటేష్ గౌడ్, మాజీ సర్పంచ్ కారింగుల శంకర్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు బల్లి శ్రీనివాస్, పల్లె సత్యం, వంశరాజ్, మాజీ కార్పొరేటర్ సంగారెడ్డి మనోహర్ రెడ్డి, ప్రేమల శ్రీనివాస్, జవహర్‌నగర్ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు మాట్ల వినయ్ కుమార్, ప్రధాన కార్యదర్శులు గజ్వేల్ శంకర్, డీఎస్ఎస్ వెంకటేశ్వర్లు, నాయకం భాస్కర్, కోశాధికారి పోలాస కిరణ్ కుమార్, ఎస్సీ సెల్ అధ్యక్షులు వీర్ల భుజంగం, కొలిపాక సాయికిరణ్, కన్నబోయిన రాజు యాదవ్, జడల బాలకృష్ణ, సుబ్రహ్మణ్యం, వడుగు రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. సమస్య పరిష్కారానికి ప్రభుత్వం తరపున చర్యలు తీసుకుంటామని పీసీసీ అధ్యక్షులు హామీ ఇచ్చినట్లు నేతలు తెలిపారు.
