ఢిల్లీలో పీసీసీ చీఫ్‌తో జవహర్‌నగర్ డంపింగ్‌యార్డ్‌పై చర్చ
ఆర్ జె న్యూస్, మేడ్చల్: జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కారంపై ఢిల్లీలో తెలంగాణ పీసీసీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్‌తో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ నేతలు భేటీ అయ్యారు. జవహర్‌నగర్ ప్రజలు ఎదుర్కొంటున్న తీవ్ర ఇబ్బందులను, డంపింగ్ యార్డ్ వల్ల కలుగుతున్న కాలుష్య సమస్యలను పీసీసీ అధ్యక్షుడి దృష్టికి తీసుకెళ్లారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని కోరారు. ఈ సమావేశంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మరియు మేడ్చల్ నియోజకవర్గ ఇంచార్జ్ యాదవ్ గారు, జవహర్‌నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు...