తీజ్ వేడుకల్లో పాల్గొన్న ప్రజాప్రతినిధులు..! తుర్కపల్లి తండాలో సంప్రదాయబద్ధంగా తీజ్ ఉత్సవాలు

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : అలియాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తుర్కపల్లి తండాలో 1వ వార్డు కౌన్సిలర్ వెంకటేష్ నాయక్ ఆధ్వర్యంలో గురువారం తీజ్ ఫెస్టివల్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మహిళలు, యువత, గ్రామ పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. లంబాడీ సంప్రదాయానికి ప్రతీకగా నిర్వహించే తీజ్ పండుగ సందర్భంగా మహిళలు సంప్రదాయ వస్త్రధారణలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు నిర్వహించి, కుటుంబాల సుఖశాంతి, గ్రామాభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాలు సందడి...