తుర్కపల్లి బీసీ గురుకుల హాస్టల్‌లో డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ

♦️గుడ్ల నిల్వ లేకపోవడంపై ఆరా.. ♦️పోషకాహారం అందించడంలో నిర్లక్ష్యం వద్దని ఆదేశం ఆర్ జె న్యూస్, మేడ్చల్ : తుర్కపల్లిలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ (బాలుర వసతి గృహం)ను జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. కె. ఆనంద్ గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య రికార్డులు, మందుల నిల్వ, వంటశాల, వసతి గృహంలోని పారిశుద్ధ్య పరిస్థితులను పరిశీలించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనం నాణ్యతను స్వయంగా తనిఖీ చేసిన ఆయన.. వంటకు ఉపయోగిస్తున్న కూరగాయల నాణ్యత,...