RJNEWS TELUGU
Date of Publish : 22 July 2026, 6:59 am Posted by : RJ NEWS TELUGU

తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా మేడ్చల్ జడ్పీహెచ్‌ఎస్ ప్రతిపాదన సందర్శించిన అదనపు కలెక్టర్

ఆర్ జె న్యూస్, మేడ్చల్ :

మేడ్చల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు)ను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. పాఠశాలలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు అవసరమైన స్థలం అందుబాటులో ఉండటంతో ఈ పాఠశాలను ఎంపిక చేశారు.ఈ నేపథ్యంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మంగళవారం మేడ్చల్ జడ్పీహెచ్‌ఎస్‌ను ఇంజినీర్లతో కలిసి సందర్శించారు. పాఠశాలలో అందుబాటులో ఉన్న స్థలం, ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తే కల్పించాల్సిన మౌలిక వసతులపై ఇంజినీర్లతో చర్చించారు. అధికారులు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు అనుమతి లభిస్తే అవసరమైన అభివృద్ధి పనులు ప్రారంభించి, వచ్చే విద్యా సంవత్సరానికి పబ్లిక్ స్కూల్‌ను ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.ఈ సందర్శనలో ఈడబ్ల్యూఐడీసీ (EWIDC) ఈఈ రాంకుమార్, ఏఈ ప్రసాద్, మండల విద్యాశాఖ అధికారి శంకరయ్య, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పద్మనాభం పాల్గొన్నారు.