తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా మేడ్చల్ జడ్పీహెచ్‌ఎస్ ప్రతిపాదన సందర్శించిన అదనపు కలెక్టర్

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల (బాలురు)ను తెలంగాణ పబ్లిక్ స్కూల్‌గా మార్చేందుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. పాఠశాలలో పబ్లిక్ స్కూల్ ఏర్పాటుకు అవసరమైన స్థలం అందుబాటులో ఉండటంతో ఈ పాఠశాలను ఎంపిక చేశారు.ఈ నేపథ్యంలో అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ మంగళవారం మేడ్చల్ జడ్పీహెచ్‌ఎస్‌ను ఇంజినీర్లతో కలిసి సందర్శించారు. పాఠశాలలో అందుబాటులో ఉన్న స్థలం, ప్రస్తుతం ఉన్న సౌకర్యాలు, పబ్లిక్ స్కూల్ ఏర్పాటు చేస్తే కల్పించాల్సిన మౌలిక వసతులపై ఇంజినీర్లతో చర్చించారు. అధికారులు ప్రభుత్వానికి పంపిన ప్రతిపాదనలకు...