తొలి ప్రపంచ ఓపెన్‌ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌లో అక్కాతమ్ముడి సత్తా

🔸నాలుగు పతకాలు కైవసం.. తెలంగాణకు, కొంపల్లి ఢిల్లీ వరల్డ్‌ పబ్లిక్‌ స్కూల్‌కు గర్వకారణం ఆర్.జె.న్యూస్,కొంపల్లి : తెలంగాణలో తొలిసారిగా నిర్వహించిన ప్రపంచ ఓపెన్‌ తైక్వాండో ఛాంపియన్‌షిప్‌–2026లో అక్కాతమ్ముడు అద్భుత ప్రతిభ కనబరిచారు. గచ్చిబౌలి స్టేడియంలో ఆగస్టు 21 నుంచి 23 వరకు జరిగిన అంతర్జాతీయ పోటీల్లో భారత్‌ తరఫున పాల్గొన్న మాలోత్‌ సాన్వి రియా, మాలోత్‌ ఆరుష్‌ మిథుల్‌ కలిపి నాలుగు పతకాలు సాధించారు. ఈ పోటీల్లో దేశంలోని 22 రాష్ట్రాలతో పాటు 12 దేశాలకు చెందిన క్రీడాకారులు పాల్గొన్నారు. 9వ తరగతి చదువుతున్న...