దళిత స్పీకర్‌ను అవమానిస్తే ఊరుకునేది లేదు!
🔸బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై కాంగ్రెస్ ఫైర్ 🔸తాతా మధు, నవీన్‌రెడ్డి రాజీనామా చేయాలి 🔸శామీర్‌పేట్‌లో కాంగ్రెస్ ఆత్మగౌరవ గర్జన.. డప్పుల దరువుకు వజ్రేష్ యాదవ్ స్టెప్పులు 🔸తుంకుంటలో అంబేద్కర్‌కు పాలాభిషేకం ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ శ్రేణులు భగ్గుమన్నాయి. దళిత స్పీకర్‌ను కించపరిచేలా మాట్లాడటం కేవలం ఒక వ్యక్తిని అవమానించడం కాదని, దళితుల ఆత్మగౌరవాన్ని అవమానించడమేనని కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌రెడ్డి తమ పదవులకు రాజీనామా...