దేవరయాంజాల్ లో సేవా కార్యక్రమం – రవీందర్ గౌడ్ కుటుంబ సభ్యుల మానవత్వం

దేవరయాంజాల్, ఆర్ జె న్యూస్ : మేడ్చల్ జిల్లా కీసర సర్కిల్, శామీర్‌పేట్ డివిజన్ పరిధిలోని దేవరయాంజాల్‌లోని శ్రీ కృష్ణ సదన్ ఓల్డ్ ఏజ్ హోమ్‌లో కీర్తిశేషులు బ్రాహ్మణపల్లి రవీందర్ గౌడ్ జ్ఞాపకార్థం కుటుంబ సభ్యులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఒక రోజు మొత్తం వృద్ధులకు భోజనం వడ్డించి, వారి ఆశీస్సులు పొందారు. తండ్రి జ్ఞాపకాలను స్మరించుకుంటూ సేవా కార్యక్రమం చేపట్టడం ద్వారా ఆయనపై ఉన్న ప్రేమాభిమానాలను చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు బ్రాహ్మణపల్లి సునీత, అభిలాష్, సంతోషి, లోకేష్ తదితరులు పాల్గొన్నారు....