RJNEWS TELUGU
Date of Publish : 02 July 2026, 8:19 am Posted by : RJ NEWS TELUGU

నూతన సీఎస్ సంజయ్ జాజును కలిసిన పీసరి మహిపాల్ రెడ్డి..!

హైదరాబాద్ ఆర్ జె న్యూస్ జూలై  2 :

తెలంగాణ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐఏఎస్ అధికారి శ్రీ సంజయ్ జాజును టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పీసరి మహిపాల్ రెడ్డి సోమవారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజయ్ జాజుకు పుష్పగుచ్ఛం అందజేసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధి, సమర్థవంతమైన పరిపాలన, ప్రజా సంక్షేమ కార్యక్రమాల సమర్థ అమలులో మీ నాయకత్వం రాష్ట్రాన్ని మరిన్ని ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుందని విశ్వసిస్తున్నాను” అని అన్నారు. సీఎస్ పదవీకాలం విజయవంతంగా సాగి, ప్రజలకు మరింత మెరుగైన పాలన అందించాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నట్లు పేర్కొన్నారు.