నోటీసుల అనంతరం ధ్రువపత్రాల పరిశీలన వేగవంతం చేయాలి

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ – 2026లో భాగంగా నోటీసులు జారీ చేసిన అనంతరం ఓటర్లు సమర్పిస్తున్న ధ్రువపత్రాల పరిశీలన ప్రక్రియను వేగవంతం చేయాలని మేడ్చల్–మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లాలోని అంతాయిపల్లి, ఉప్పరపల్లి గ్రామాల్లోని పోలింగ్‌ స్టేషన్లను కలెక్టర్ సందర్శించి ఎస్‌ఐఆర్‌–2026 ప్రక్రియను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మ్యాపింగ్‌ జరగని ఓటర్లు, ఓటరు కార్డులో వ్యత్యాసాలు ఉన్న కేటగిరీలకు జారీ చేసిన నోటీసులకు సంబంధించి ఓటర్లు అందిస్తున్న ధ్రువపత్రాలను...