పాన్‌షాప్ ముసుగులో గంజాయి చాక్లెట్ల దందా.. 25 కిలోల సరుకు సీజ్
ఆర్.జె.న్యూస్, మేడ్చల్: పాన్‌షాప్ నిర్వహిస్తున్నట్లు బయటకు కనిపిస్తూ.. లోపల మాత్రం గంజాయి చాక్లెట్ల అక్రమ విక్రయానికి పాల్పడుతున్న వ్యక్తిని శామీర్‌పేట్ పోలీసులు పట్టుకున్నారు. భారీ మొత్తంలో గంజాయి చాక్లెట్ ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నిందితుడి భార్య పరారీలో ఉండగా, ఆమె కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను శనివారం శామీర్‌పేట్ పోలీస్ స్టేషన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఏసీపీ చక్రపాణి వెల్లడించారు. బీహార్ రాష్ట్రానికి చెందిన బైద్నాద్ (29) తన భార్య పూజా కుమారితో కలిసి శామీర్‌పేట్ పోలీస్...