పారిశుద్ధ్య కార్మికులకు బతుకమ్మ కానుక

ఆర్‌జే న్యూస్, జవహర్‌నగర్ : సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని జవహర్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న పారిశుద్ధ్య మహిళా కార్మికులకు మాజీ డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్ గుప్తా దంపతులు బతుకమ్మ కానుకగా చీరలను పంపిణీ చేశారు. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న కృషి మరువలేనిదని, వారి సేవలను గుర్తించి అండగా నిలవడం తమ బాధ్యత అని శ్రీనివాస్ గుప్తా అన్నారు. బతుకమ్మ పండుగ మహిళలకు ఎంతో ప్రత్యేకమైనదని, పండుగ వేళ వారి ముఖంలో చిరునవ్వు చూడటమే...