పారిశ్రామికవాడ–కిష్టాపూర్‌ రోడ్డును బాగుచేయాలి

ఆర్.జె.న్యూస్,మేడ్చల్‌ : పారిశ్రామికవాడ–కిష్టాపూర్‌ రోడ్డుకు వెంటనే మరమ్మతులు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ నాయకులు నవీన్‌రెడ్డి, తుడుం గణేశ్‌ డిమాండ్‌ చేశారు. శుక్రవారం పారిశ్రామికవాడ రోడ్డుపై వారు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రహదారి పూర్తిగా ధ్వంసమై ఏళ్లు గడుస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆరోపించారు. గుంతలతో దెబ్బతిన్న రహదారిపై ప్రయాణిస్తున్న వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారని తెలిపారు. రోడ్డు మరమ్మతులపై పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన రహదారి వర్షాలు, భారీ వాహనాల రాకపోకలతో అధ్వానంగా మారిందని...