ఆర్.జె.న్యూస్, గచ్చిబౌలి : గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో నమోదైన అత్యాచారం, పోక్సో కేసులో నిందితుడికి కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. క్రైమ్ నంబర్ 642/2023, సెషన్స్ కేసు నంబర్ 313/2023కు సంబంధించి రాజేంద్రనగర్ లోని రేప్, పోక్సో కేసుల ఫాస్ట్ ట్రాక్ స్పెషల్ కోర్టులో విచారణ జరిగింది. న్యాయమూర్తి టీ. శ్రీనివాస్ తీర్పును వెలువరించారు. రేప్, పోక్సో, ఎస్సీ-ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద నమోదైన ఈ కేసులో నిందితుడు మీనగల వెంకుగోపాల్ అలియాస్ వేణు (42) కు 20 ఏళ్ల జైలు శిక్షతో పాటు రూ.3 వేల జరిమానా విధించారు. బాధితురాలికి రూ.3 లక్షల పరిహారం అందించాలని కోర్టు ఆదేశించింది. ఈ కేసులో గచ్చిబౌలి పోలీసులు సమర్థవంతంగా దర్యాప్తు చేసి, పక్కా ఆధారాలతో కోర్టులో అభియోగాలను నిరూపించారని పోలీసు అధికారులు తెలిపారు.