పోలీస్ ఉద్యోగాల్లో మేడ్చల్ యువతకు న్యాయం చేయాలి
ఆర్.జే.న్యూస్, మేడ్చల్ : పోలీస్ ఉద్యోగ నియామకాల్లో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా యువతకు న్యాయం జరిగేలా ప్రభుత్వం విధానపరమైన మార్పులు చేపట్టాలని మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్‌చార్జి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్‌రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా ప్రెస్‌క్లబ్‌లో గురువారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పోలీస్ కానిస్టేబుల్ నియామకాల్లో సివిల్, ఏఆర్ పోస్టులను జనాభా, పోలీస్‌స్టేషన్ల అవసరాలు, ఖాళీల ఆధారంగా భర్తీ చేయాలని కోరారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా జనాభా పరంగా పెద్దదైనందున పోలీస్‌స్టేషన్లు, సిబ్బంది అవసరం కూడా అధికంగా ఉందన్నారు....