పోషకాహారంతో ఆరోగ్యకరమైన భవిష్యత్తు..! మేడ్చల్ జిల్లాలో 9వ పోషణ్ మాహ్
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : ప్రజల్లో పోషకాహారం, ఆరోగ్యం, పరిశుభ్రత, ఆరోగ్యకరమైన జీవన విధానంపై అవగాహన కల్పించేందుకు 9వ పోషణ్ మాహ్ కార్యక్రమాలు జిల్లాలో ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్ 9 నుంచి అక్టోబర్ 8 వరకు నెల రోజుల పాటు జిల్లావ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి తెలిపారు.ఈ సందర్భంగా బుధవారం ఐడీఓసీ కాంప్లెక్స్‌లో జిల్లా కలెక్టర్ 9వ పోషణ్ మాహ్ పోస్టర్‌ను ఆవిష్కరించారు. 793 అంగన్‌వాడీల్లో కార్యక్రమాలు జిల్లాలోని 793 అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో నెల రోజుల పాటు వివిధ అవగాహన, సామాజిక భాగస్వామ్య...