ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం : ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తీవ్ర విమర్శలు
ఆర్ జె న్యూస్, హైదరాబాద్ : హైదరాబాద్‌లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన 'యువ సంగ్రామ సదస్సు' నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సదస్సుకు తొలుత పోలీసులు అనుమతి నిరాకరించినప్పటికీ, గౌరవ హైకోర్టు జోక్యంతో సభ నిర్వహణకు అనుమతి లభించిందని ఆయన పేర్కొన్నారు. అయితే, కోర్టు అనుమతి ఇచ్చిన అనంతరం కూడా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఐపీఎస్ అధికారి ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్లను సభకు వెళ్లకుండా అడ్డుకుని హౌస్...