ప్రజా హృదయాల్లో చిరస్మరణీయుడు వైఎస్సార్
ఆర్.జె.న్యూస్, మూడుచింతలపల్లి : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, నిరుపేదల పెన్నిధి, మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి వేడుకలు మూడుచింతలపల్లి మున్సిపాలిటీలో అత్యంత ఘనంగా జరిగాయి. మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేశం ఆధ్వర్యంలో స్థానిక నేతలు, కార్యకర్తలు వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి భావోద్వేగాల మధ్య నివాళులర్పించారు. ఈ సందర్భంగా ‘వైఎస్సార్ అమర్ రహే’ అంటూ చేసిన నినాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది. కార్యక్రమంలో మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దోసకాయల వెంకటేశం మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమమే పరమావధిగా...