RJNEWS TELUGU
Date of Publish : 14 July 2026, 12:13 pm Posted by : RJ NEWS TELUGU

ప్రతిభకు ప్రోత్సాహం..! విద్యార్థినికి రూ.21 వేల ఆర్థిక సాయం అందజేసిన కౌన్సిలర్

ఆర్ జె న్యూస్, మేడ్చల్ :

ఇంటర్మీడియట్‌లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని ఉన్నత విద్యకు చేయూతగా మూడుచింతలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని 22వ వార్డు కౌన్సిలర్ ఆది అజయ్ కుమార్ పటేల్ రూ.21 వేల ఆర్థిక సహాయం అందజేశారు.22వ వార్డుకు చెందిన గ్యార చంద్రయ్య, సుజాత దంపతుల కుమార్తె గ్యార శ్రావణి, శ్రీ బాలాజీ వెంకటేశ్వర జూనియర్ కళాశాలలో సీఈసీ గ్రూపులో ప్రథమ ర్యాంకు సాధించింది. ఆమె ప్రతిభను అభినందించిన కౌన్సిలర్ ఆది అజయ్ కుమార్ పటేల్, ఉన్నత విద్యాభ్యాసానికి ప్రోత్సాహకంగా రూ.21 వేల నగదు అందించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడం సమాజం బాధ్యత అని, ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఏ విద్యార్థి చదువుకు దూరం కాకూడదని అన్నారు. శ్రావణి ఉన్నత విద్యలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.కౌన్సిలర్ అందించిన సహాయానికి విద్యార్థిని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. స్థానికులు కూడా విద్యార్థులకు అండగా నిలుస్తున్న ఆదిఅజయ్ కుమార్ పటేల్ సేవలను అభినందించారు.