RJNEWS TELUGU
Date of Publish : 29 July 2026, 10:30 pm Posted by : RJ NEWS TELUGU

ఫారెస్ట్ అకాడమీ వ్యాసరచన పోటీలో KOMAPLLY-1 LEAD బ్యాచ్‌కు ప్రథమ బహుమతి

ఆర్ జె న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ ఫారెస్ట్ అకాడమీ నిర్వహించిన రాష్ట్రస్థాయి వ్యాసరచన పోటీలో శ్రీ చైతన్య విద్యాసంస్థ KOMAPLLY-1 CBSE బ్రాంచ్ LEAD బ్యాచ్ విద్యార్థులు ప్రథమ బహుమతిని సాధించి పాఠశాలకు గర్వకారణంగా నిలిచారు.పర్యావరణ పరిరక్షణ, అటవీ సంరక్షణ, జీవవైవిధ్యం, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలపై విద్యార్థులు రాసిన వ్యాసాలు న్యాయనిర్ణేతలను విశేషంగా ఆకట్టుకుని రాష్ట్రస్థాయిలో మొదటి స్థానాన్ని దక్కించుకున్నాయి.గ్లోబల్ టైగర్ డే సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన పోటీలో శ్రీ చైతన్య విద్యాసంస్థలు, Kompally-1 CBSE Branch LEAD విద్యార్థిని హర్షిణీ   8వ తరగతి ప్రధమ బహుమతిని సాధించి సంస్థకు గర్వకారణంగా నిలిచింది. ఈ బహుమతిని తెలంగాణ అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అందజేశారు. ఈ సందర్భంగా శ్రీ చైతన్య విద్యాసంస్థ  KOMAPLLY-1 AGM రవి, ప్రిన్సిపల్ రాజేష్ రెడ్డి, CO నరేంద్ర భూపతి, సోమేశ్వర రావు, LEAD ఇన్‌చార్జ్ ప్రమోద్ కుమార్ విజేత విద్యార్థులను అభినందించి, వారి కృషిని ప్రశంసించారు. విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం పెంపొందించేందుకు నిరంతరం ప్రోత్సాహం అందిస్తున్న గౌరవ అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖకి పాఠశాల యాజమాన్యం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపింది. ఇలాంటి పోటీలు విద్యార్థుల్లో రచనా నైపుణ్యంతో పాటు సామాజిక బాధ్యత, పర్యావరణంపై అవగాహనను పెంపొందిస్తాయని LEAD ఇన్‌చార్జ్ ప్రమోద్ కుమార్ తెలిపారు. విజేతలను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు అభినందించారు.