ఫీజు బకాయిలపై పోస్టర్ ఆవిష్కరణ

ఆర్ జె న్యూస్, బాలానగర్ : తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న 15వేల కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను, మెస్ బిల్లులను తక్షణమే విడుదల చేయాలని బీజేవైఎం ఆధ్వర్యంలో శనివారం జేఎన్ టీయూహెచ్ ప్రధాన ముఖద్వారం వద్ద పోస్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర మానిటరింగ్ కన్వీనర్ చల్లా రామకృష్ణ మాట్లాడు తూ.. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫల మైందని విమర్శించారు. రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం...