బాలాపూర్ గణేష్‌కు ఈసారి పూరీ జగన్నాథ్ ఆలయ థీమ్
🔸ఒడిశా శ్రీ జగన్నాథ స్వామి ఆలయ వైభవాన్ని తలపించేలా నమూనా 🔸సుధాకర్ రెడ్డి డెకరేటర్స్ ఆధ్వర్యంలో సిద్ధం ఆర్.జె.న్యూస్, హైదరాబాద్ బాలాపూర్ : ప్రతి ఏడాది ప్రత్యేక ఆలయ థీమ్‌లతో భక్తులను ఆకట్టుకుంటున్న బాలాపూర్ గణేష్ ఈసారి మరో అద్భుతంతో ముందుకు రానున్నారు. ఈ సంవత్సరం వినాయక చవితి సందర్భంగా ఒడిశాలోని పవిత్ర పుణ్యక్షేత్రం పూరీ శ్రీ జగన్నాథ స్వామి ఆలయ థీమ్‌లో బాలాపూర్ గణేష్ భక్తులకు దర్శనమివ్వనున్నారు. 🔸పూరీ జగన్నాథ ఆలయ వైభవం జగన్నాథ స్వామి ఆలయ కట్టడం, గోపురం, శిల్పకళా వైభవాన్ని...