బాలాపూర్ గణేష్ ఉత్సవాలకు ఘన ఏర్పాట్లు.. ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణ పూరి జగన్నాథ ఆలయ నమూనా
ఆర్.జె.న్యూస్, వెబ్ డెస్క్ : రంగారెడ్డి జిల్లా బాలాపూర్‌లో వినాయక చవితి ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ ఏడాది భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ ఏడాది ప్రత్యేక ఆకర్షణగా ఒడిశాలోని పూరి జగన్నాథ ఆలయ నమూనాను ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్సవ సమితి అధ్యక్షుడు కళ్లెం నిరంజన్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం ఆలయ నమూనా నిర్మాణ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని, భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతి కలిగేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. వినాయక చవితి ఉత్సవాలకు భారీ...