బొమ్మరాసిపేట భూ బాధితుల ధర్నా
ఆర్.జె.న్యూస్,మేడ్చల్ జిల్లా : బొమ్మరాసిపేట రైతుల భూముల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం శామీర్‌పేట్ మండల రెవెన్యూ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆదేశాల మేరకు చేపట్టిన ఆందోళనకు మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, రాగిడి లక్ష్మారెడ్డి తదితరులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా బీఆర్‌ఎస్ నేతలు మాట్లాడుతూ.. బొమ్మరాసిపేట రైతుల భూములను కొంతమంది అక్రమంగా ఆక్రమించుకునేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అండతో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, మంత్రి పొంగులేటి...