RJNEWS TELUGU
Date of Publish : 22 August 2026, 6:50 pm Posted by : RJ NEWS TELUGU

భవన నిర్మాణ కార్మికులు లేబర్‌ కార్డులు తీసుకోవాలి

ఆర్.జె.న్యూస్,మేడ్చల్‌ : భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు లేబర్‌ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని సీఐటీయూ మేడ్చల్‌ మండల కమిటీ విజ్ఞప్తి చేసింది. సీఐటీయూ అనుబంధ బీసీడబ్ల్యూ యూనియన్‌ ఆధ్వర్యంలో అడ్డాలపై పనిచేస్తున్న కార్మికులకు లేబర్‌ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా సీఐటీయూ మేడ్చల్‌ మండల కార్యదర్శి నరేష్‌ మాట్లాడుతూ. లేబర్‌ కార్డు ఉంటే కార్మికులకు ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయాలుపొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందితే రూ.10 లక్షలు, సహజ మరణానికి రూ.2 లక్షల వరకు ఆర్థిక సహాయం అందుతుందని తెలిపారు. కార్మికుడి కుమార్తె వివాహానికి రూ.30 వేల వరకు, ప్రసవ సమయంలో రూ.30 వేల వరకు ఆర్థిక సహాయం అందుతుందని చెప్పారు. అంగవైకల్యానికి గురైన కార్మికులకు రూ.50 వేల వరకు సహాయం లభిస్తుందని పేర్కొన్నారు. అందువల్ల భవన నిర్మాణ పనుల్లో పాల్గొనే ప్రతి కార్మికుడు లేబర్‌ కార్డు తీసుకోవాలని నరేష్‌ కోరారు. మరిన్ని వివరాల కోసం 9951408268, 7569266582, 7993929594 నంబర్లను సంప్రదించాలని సూచించారు.కార్యక్రమంలో బీసీడబ్ల్యూ యూనియన్‌ జిల్లా నాయకులు అశోక్‌, మండల నాయకులు ఎన్‌. కృష్ణ, జి. శ్రీను, స్వామి, చ. కృష్ణ, ఎల్లం, ఎల్లయ్య, అస్తరమ్మ, రజిని, సుతారి గూడ శ్రీను, అనిత తదితరులు పాల్గొన్నారు.