భవన నిర్మాణ కార్మికులు లేబర్ కార్డులు తీసుకోవాలి
ఆర్.జె.న్యూస్,మేడ్చల్ : భవన నిర్మాణ రంగంలో పనిచేస్తున్న ప్రతి కార్మికుడు లేబర్ కార్డు తప్పనిసరిగా తీసుకోవాలని సీఐటీయూ మేడ్చల్ మండల కమిటీ విజ్ఞప్తి చేసింది. సీఐటీయూ అనుబంధ బీసీడబ్ల్యూ యూనియన్ ఆధ్వర్యంలో అడ్డాలపై పనిచేస్తున్న కార్మికులకు లేబర్ కార్డుల కోసం దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా సీఐటీయూ మేడ్చల్ మండల కార్యదర్శి నరేష్ మాట్లాడుతూ. లేబర్ కార్డు ఉంటే కార్మికులకు ప్రభుత్వం అందించే వివిధ సంక్షేమ పథకాలు, ఆర్థిక సహాయాలుపొందే అవకాశం ఉంటుందన్నారు. ప్రమాదవశాత్తు కార్మికుడు మృతి చెందితే రూ.10 లక్షలు, సహజ...