భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలి – జిల్లా కలెక్టర్లతో సి.ఎస్ టెలీ కాన్ఫరెన్స్
ఆర్ జె న్యూస్, హైదరాబాద్ : రాబోయే రెండు, మూడు రోజుల్లో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని కేంద్ర వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో ప్రజలకు ఏవిధమైన ఇబ్బందులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు, వ్యవసాయ ప్రత్యామ్నాయ ప్రణాళిక, వనమహోత్సవం తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్.పీ లతో మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుండి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ...