భ్రూణ లింగ నిర్ధారణ చేస్తే కఠిన చర్యలు!
🔸పీసీపీఎన్‌డీటీ నిబంధనలు ఉల్లంఘిస్తే ఉపేక్షించేది లేదు: డీఎంహెచ్‌ఓ డాక్టర్ కె. ఆనంద్ ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : భ్రూణ లింగ నిర్ధారణకు పాల్పడే ఆసుపత్రులు, స్కానింగ్ కేంద్రాలపై అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. పీసీపీఎన్‌డీటీ చట్ట నిబంధనలను ఉల్లంఘిస్తూ ఆడ శిశువులపై వివక్షకు, భ్రూణహత్యలకు దారితీసే చర్యలకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. ఆనంద్ స్పష్టం చేశారు.రాష్ట్ర స్థాయి పీసీపీఎన్‌డీటీ టాస్క్‌ఫోర్స్ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు గుర్తించిన నేపథ్యంలో జోడిమెట్ల ఎక్స్ రోడ్, పోచారం...