మంటల్లో కారు.. లోపల మృతదేహం!

🔸లాండ్రీ వ్యాపారి దారుణ మృతి 🔸అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులే కారణమా? 🔸బౌరంపేటలో విషాద ఘటన.. 🔸 దుండిగల్ పోలీసుల దర్యాప్తు ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : బౌరంపేటలో సోమవారం ఉదయం దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓపెన్ ల్యాండ్‌లో నిలిపి ఉన్న కారు ఒక్కసారిగా మంటల్లో చిక్కుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించగా.. కారులో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైంది.పోలీసుల వివరాల ప్రకారం.. బౌరంపేటలోని రుద్ర కన్స్ట్రక్షన్స్ సమీపంలోని ఓపెన్ ల్యాండ్‌లో సోమవారం ఉదయం 7 గంటల ప్రాంతంలో కారు మంటల్లో కాలిపోతుండటాన్ని...