మట్టి గణపతిని ప్రతిష్టిద్దాం.. పర్యావరణాన్ని పరిరక్షిద్దాం

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : పర్యావరణ పరిరక్షణలో భాగంగా పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలను వినియోగించాలని తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రజలకు పిలుపునిచ్చింది. వినాయక చవితిని పురస్కరించుకుని మట్టి గణపతి విగ్రహాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో సోమవారం ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మిక్కిలినేని మను చౌదరీ, ఐఏఎస్, అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఫైజాన్ అహ్మద్, ఐఏఎస్, తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ కార్యాలయం, మేడ్చల్...