RJNEWS TELUGU
Date of Publish : 12 September 2026, 7:08 pm Posted by : RJ NEWS TELUGU

మట్టి గణపతుల పంపిణీతో సీఎంఆర్‌లో సిల్వర్ జూబ్లీ వేడుకలు

ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : వినాయక చవితిని పురస్కరించుకుని మేడ్చల్‌లోని సీఎంఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కళాశాల సిల్వర్ జూబ్లీ వేడుకల్లో భాగంగా ఆర్ట్స్ అండ్ కల్చర్ బోర్డు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఈవో అభినవ్ రెడ్డి, ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రావు, హెచ్‌ఓడీలు, డీన్లు, డైరెక్టర్లు, ఉన్నతాధికారులకు సుమారు 30-35 మట్టి గణేశ విగ్రహాలను పంపిణీ చేశారు. కళాశాల పూర్వ విద్యార్థి నవీన్ సహకారంతో విగ్రహాలను అందించినట్లు నిర్వాహకులు తెలిపారు. 25 ఏళ్ల ప్రస్థానాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు సాంస్కృతిక విలువలను చాటిచెప్పినట్లు పేర్కొన్నారు.