మల్లారెడ్డి యూనివర్సిటీలో టాక్సిక్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అపశ్రుతి

🔸విద్యార్థులపై పడిన సౌండ్‌ స్పీకర్లు.. పలువురికి గాయాలు ఆర్.జె.న్యూస్, మేడ్చల్‌ : మల్లారెడ్డి యూనివర్సిటీలో నిర్వహించిన ‘టాక్సిక్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో అపశ్రుతి చోటుచేసుకుంది. కార్యక్రమానికి భారీ సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యారు. ఈ క్రమంలో వేదిక సమీపంలో ఏర్పాటు చేసిన సౌండ్‌ స్పీకర్లు విద్యార్థులపై పడటంతో పలువురికి గాయాలయ్యాయి.ఈ ఘటనతో ఒక్కసారిగా అక్కడ గందరగోళం నెలకొంది. గాయపడిన విద్యార్థులను వెంటనే అంబులెన్సుల్లో ఆసుపత్రికి తరలించారు. ఈవెంట్‌ ప్రాంగణంలో విద్యార్థులు భారీగా గుమిగూడటంతో ఒకసారిగా ఉద్రిక్తత పరిస్థితి ఏర్పడినట్లు సమాచారం. సౌండ్‌ స్పీకర్లు ఏర్పాటు చేసిన...