మాజీ సర్పంచ్ బండారి నరేందర్ కు మద్దతుగా కండ్లకోయ కాంగ్రెస్ పార్టీ నాయకులు

గుండ్లపోచంపల్లి ( ఆర్ జె న్యూస్ ) జూలై 3: గుండ్లపోచంపల్లి 299 డివిజన్ పరిధిలోని కండ్లకోయ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మాజీ సర్పంచ్ బండారి నరేందర్ ముదిరాజ్‌కు మద్దతుగా సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాపాడిన సీనియర్ నాయకుడు బండారి నరేందర్‌కు డివిజన్ అధ్యక్ష పదవి ఇవ్వకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన నరేందర్‌కు అన్యాయం జరిగిందని, అధిష్ఠానం పునరాలోచించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో...