మిషన్ భగీరథ నీటికి మోటార్లు..!
🔸 రాఘవేంద్ర నగర్‌లో తాగునీటి కోసం ప్రజల అవస్థలు 🔸 కొంతమంది అక్రమంగా మోటార్లు బిగించి నీరు లాగుతున్నారని ఆరోపణలు.. 🔸 పట్టించుకోని జీహెచ్‌ఎంసీ అధికారులు ఆర్ జె న్యూస్, మేడ్చల్: మేడ్చల్ జీహెచ్‌ఎంసీ పరిధిలోని రాఘవేంద్ర నగర్ కాలనీలో మిషన్ భగీరథ తాగునీటి సరఫరాపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. కొంతమంది పైప్‌లైన్‌కు అక్రమంగా మోటార్లు బిగించి అధికంగా నీటిని లాగుతున్నారని, దీంతో మిగిలిన కాలనీవాసులకు తగినంత నీరు అందడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.మోటార్ల ద్వారా కొందరు నీటిని లాగేయడంతో పైప్‌లైన్‌లో నీటి ఒత్తిడి...