మున్సిపల్ కార్యాలయం ముందే సమస్యల గుట్ట..!

  ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మున్సిపల్ అభివృద్ధి చేస్తున్నామని, ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తున్నామని గొప్పలు చెప్పుకునే ఎల్లంపేట్ మున్సిపల్ పాలకుల పనితీరు వారి కార్యాలయం ముందే బట్టబయలవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన మున్సిపల్ కార్యాలయం పరిసరాల్లోనే వరుస సమస్యలు తిష్టవేయడంతో స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. భద్రత, పర్యవేక్షణ కోసం లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన కెమెరాలు మూగబోయినా వాటి...