మెడిసిటీలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : ఎల్లంపేట్ మున్సిపల్ పరిధిలోని ఘన్‌పూర్‌లోని మెడిసిటీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. సుశేన హెల్త్ ఫౌండేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఆగస్టు 7 వరకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రొఫెసర్ కె. శివరామకృష్ణ జ్యోతి ప్రజ్వలనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. డా. కల్పన మాట్లాడుతూ, పుట్టిన వెంటనే తల్లిపాలు ఇవ్వడం వల్ల శిశువుకు రోగనిరోధక శక్తి పెరుగుతుందని తెలిపారు. తొలి ఆరు నెలలు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని సూచించారు. ఈ...