మేడ్చల్‌లో అభివృద్ధి–సంక్షేమమే కాంగ్రెస్ లక్ష్యం : మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వజ్రేష్ యాదవ్
ఆర్ జె న్యూస్ మేడ్చల్ : మేడ్చల్ నియోజకవర్గంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కాంగ్రెస్ శ్రేణులకు మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు తోటకూర వజ్రేష్ (జంగయ్య) యాదవ్ పిలుపునిచ్చారు.మేడ్చల్ డివిజన్‌కు చెందిన కనకాల శివకుమార్ (బిపిటి రాజు)కు జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నియామకపత్రాన్ని అందజేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలిసారిగా మేడ్చల్ నియోజకవర్గంలో సమగ్ర అభివృద్ధి పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని...