మేడ్చల్‌లో నకిలీ డాక్టర్ల గుట్టురట్టు!
🔸 ఐదుగురిని పట్టుకున్న కుత్బుల్లాపూర్ డివిజన్ SOT పోలీసులు ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : వైద్య విద్య, సరైన అర్హతలు లేకుండానే డాక్టర్ల అవతారమెత్తి ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న నకిలీ వైద్యులపై కుత్బుల్లాపూర్ డివిజన్ SOT పోలీసులు ఉక్కుపాదం మోపారు. మేడ్చల్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిబంధనలకు విరుద్ధంగా వైద్య సేవలు అందిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు మొత్తం ఐదుగురిని పట్టుకున్నారు.పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో ఎల్లంపేట్‌కు చెందిన మోత్కూరి సుధాకర్ చారి, ధర్మగోని అంజయ్యగౌడ్ ఉన్నట్లు సమాచారం. మేడ్చల్‌లో ఇద్దరు, జగద్గిరిగుట్టలో ఒకరు, పేట్‌బషీరాబాద్‌లో ఒకరు,...