మేడ్చల్‌లో విద్యుత్ శాఖ సమీక్ష సమావేశం..! నిరంతరాయ విద్యుత్ సరఫరాపై అధికారుల ఆదేశాలు

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : వినియోగదారులకు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్ సరఫరా అందించడంతో పాటు అత్యవసర ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించేందుకు విద్యుత్ శాఖ అధికారులు సమీక్ష సమావేశం నిర్వహించారు.సమావేశంలో వినియోగదారులకు ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా కొనసాగించే చర్యలు, అత్యవసర సేవలకు సంబంధించిన ఫిర్యాదులను అత్యల్ప సమయంలో పరిష్కరించే విధానాలు, ఉద్యోగుల పనితీరు మెరుగుదల, రాబోయే రోజుల్లో చేపట్టనున్న అభివృద్ధి పనులపై విస్తృతంగా చర్చించారు.ప్రజలకు మెరుగైన సేవలు అందించడంలో నిర్లక్ష్యానికి తావులేకుండా విధులు నిర్వహించాలని, ప్రతి ఫిర్యాదుపై వెంటనే స్పందించాలని అధికారులు...