మేడ్చల్ డిపోలో ఘనంగా బోనాలు

ఆర్ జె న్యూస్, మేడ్చల్: టీజీఎస్‌ఆర్టీసీ మేడ్చల్ డిపో గ్యారేజ్‌లో ఆషాఢ మాస బోనాల మహోత్సవాన్ని ఆదివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. డిపో అధికారులు, ఉద్యోగులు, డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజ్, ఔట్‌సోర్సింగ్ సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి కృపతో ప్రజలందరికీ ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, శాంతి, ఐశ్వర్యాలు కలగాలని అమ్మవారిని కోరుకున్నారు.