RJNEWS TELUGU
Date of Publish : 01 August 2026, 6:00 pm Posted by : RJ NEWS TELUGU

మేడ్చల్ సీఐ అంజిరెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన కాంగ్రెస్ నాయకులు

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ సర్కిల్ ఇన్‌స్పెక్టర్ ఇటీవల బాధ్యతలు స్వీకరించిన అంజిరెడ్డిని కాంగ్రెస్ పార్టీ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రామన్నగారి రాఘవేందర్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లా కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు మహమ్మద్ అయూబ్ ఖాన్ (యూసుఫ్), జిల్లా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కనకాల శివకుమార్ (బిపిటిరాజు), మాజీ కౌన్సిలర్ కౌడే మహేష్ కురుమతో పాటు ఇర్ఫాన్, నడికొప్పు రంజిత్ ముదిరాజ్, కటిక వినయ్, రవితేజ రెడ్డి తదితరులు సీఐ అంజిరెడ్డిని కలిసి శాలువాతో సత్కరించి, పూల బొకే అందజేశారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ మేడ్చల్ ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు అందిస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి సమర్థవంతంగా కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతన బాధ్యతల్లో విజయవంతంగా ముందుకు సాగాలని కోరుతూ సీఐ అంజిరెడ్డికి అభినందనలు తెలియజేశారు.