RJNEWS TELUGU
Date of Publish : 05 September 2026, 1:04 pm Posted by : RJ NEWS TELUGU

బీపీ తగ్గి.. బస్సు బీభత్సం!

🔸డివైడర్ ఎక్కి అవతలి రోడ్డులోకి దూసుకెళ్లిన బస్సు
🔸కారు, బైక్‌ను ఢీకొట్టిన వైనం..
🔸15 మంది ప్రయాణికులు సేఫ్
🔸రాజీవ్ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్
ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : శామీర్‌పేట్‌ రాజీవ్ రహదారిపై మంచిర్యాల డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి బీభత్సం సృష్టించింది. హైదరాబాద్‌ నుంచి మంచిర్యాల వెళ్తున్న బస్సు డ్రైవర్‌కు ఒక్కసారిగా బీపీ తగ్గడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. దీంతో బస్సు డివైడర్‌ను ఎక్కి అవతలి వైపు రోడ్డుపైకి దూసుకెళ్లి కారు, బైక్‌ను ఢీకొట్టింది.అయితే డ్రైవర్‌ వెంటనే బస్సును నిలిపివేయడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాద సమయంలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ఘటనతో రాజీవ్ రహదారిపై భారీగా ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించారు.