రాయదుర్గం భవనం కూలిన ఘటన – బిల్డర్ అరెస్ట్, కాంట్రాక్టర్ పరారీలో ఉన్నా పట్టుకున్న పోలీసులు
ఆర్.జె.న్యూస్, రాయదుర్గం : గచ్చిబౌలి అంజయ్య నగర్ లో నిర్మాణంలో ఉన్న G+6+పెంట్ హౌస్ భవనం కూలి ఇద్దరు కార్మికులు మృతి చెందిన ఘటనలో రాయదుర్గం పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఆగస్టు 22న మధ్యాహ్నం భవనం ఒక్కసారిగా కూలిపోవడంతో టైల్స్ పనులు చేస్తున్న ఉమేష్ కారే, మొహ్ పాల్ భలావి అనే ఇద్దరు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ప్రమాదంలో కేవీ రమణారెడ్డి (75) కి తీవ్ర గాయాలు కాగా, పక్కన ఉన్న ఫ్లాట్ కు కూడా నష్టం వాటిల్లింది. ఈ...