రైతు సంఘాల ఎన్నికల నుంచి పారిపోతున్న కాంగ్రెస్ : బీజేపీ

ఆర్ జె న్యూస్, మేడ్చల్ : తెలంగాణ రాష్ట్రంలో రైతు సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం నామినేషన్ల ద్వారా పదవులను భర్తీ చేస్తోందని బీజేపీ మేడ్చల్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లంపేట్ గౌరారం జగన్ గౌడ్ ఆరోపించారు. ఎన్నికలు నిర్వహించే ధైర్యం లేకే రైతుల ఓటు హక్కును హరిస్తున్నారని విమర్శించారు. రైతు సహకార సంఘాలకు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు నిర్వహించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్న ఆయన, ఎన్నికలను పక్కనపెట్టి డైరెక్టర్లు, చైర్మన్‌లు, వైస్ చైర్మన్‌లను నామినేట్ చేయడం ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య అని...