రోడ్ల దుస్థితిని జోనల్ కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన మాజీ కౌన్సిలర్
♦️మరమ్మతులతో పాటు సీసీ రోడ్లు నిర్మిస్తాం : పింకేష్ కుమార్ ఆర్.జె.న్యూస్, మేడ్చల్ : మేడ్చల్ 297 డివిజన్ పరిధిలోని రోడ్ల దుస్థితిని మాజీ కౌన్సిలర్, కాంగ్రెస్ నేత రామన్నగారి మణికంఠ గౌడ్ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్ పింకేష్ కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో జోనల్ కమిషనర్‌ను స్వయంగా తీసుకెళ్లి రోడ్ల పరిస్థితిని చూపించారు. చాలా ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా ధ్వంసమై గుంతలమయంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మణికంఠ గౌడ్ తెలిపారు. చినుకు పడితే రోడ్లపై నీరు...