RJNEWS TELUGU
Date of Publish : 01 September 2026, 7:29 am Posted by : RJ NEWS TELUGU

లాల్‌గడి మలక్‌పేట్‌లో రూ.8 లక్షల సీసీ రోడ్డు పనులకు శ్రీకారం

ఆర్. జె. న్యూస్, మేడ్చల్ : అలియాబాద్ పురపాలక సంఘం పరిధిలోని లాల్‌గడి మలక్‌పేట్ 15వ వార్డులో రూ.8 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను పురపాలక సంఘం చైర్‌పర్సన్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ప్రారంభించారు. మున్సిపల్ జనరల్ నిధులతో ఈ పనులను చేపడుతున్నట్లు తెలిపారు.ఈ సందర్భంగా చైర్‌పర్సన్ మాట్లాడుతూ.. పురపాలక సంఘం పరిధిలో ప్రజలకు మెరుగైన రహదారులు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని అన్నారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి వార్డును సమగ్రంగా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో వార్డు ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ మున్సిపల్ పాలకవర్గానికి కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వైస్ చైర్‌పర్సన్ కనరెడ్డి మాలతి మాధవ రెడ్డి, స్థానిక కౌన్సిలర్ తాళ్ల స్వప్న రాంప్రసాద్, కౌన్సిలర్లు కైరా గణేష్, తలారి మౌనిక బాబు, మున్సిపల్ కమిషనర్ ఎన్. వెంకట్ రెడ్డి, మున్సిపల్ ఏఈఈ సనా షాహీన్, మున్సిపల్ సిబ్బంది, వార్డు ప్రజలు పాల్గొన్నారు.